Friday, December 31, 2010

Kobbari Annam(Coconut Rice)

కావాల్సిన పదార్దములు:
బాసుమతి రైస్:4 కప్స్
ఉల్లిపాయలు:1   ( పొడుగ్గా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి:3 
జీడిపప్పు:15 
కరవేపాకు:1 రెమ్మ 
అల్లం వెల్లుల్లి పేస్టు:1  స్పూన్
బిర్యాని ఆకు: 2       
                                                           
లవంగాలు:3   
యాలకులు:2 
దాల్చిన చెక్క:1 ఇంచ్
కొబ్బరి పాలు:1 టిన్
నెయ్యి:2   స్పూన్స్       
ఆయిల్:5 స్పూన్స్
ఉప్పు: 1 1/2 

తయారు చేసే విధానం:
ముందుగా బాసుమతి రైస్ ను శుభ్రంగా కడుగుకుని నీళ్ళల్లో 15 నిమిషాలు నానబెట్టుకోవాలి.దాల్చిన చెక్క,యాలకులు,లవంగాలను కచ్చ పచ్చాగ దంచుకోవాలి.పాన్ తీసుకుని దానిలో నెయ్యి,ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత బిర్యాని ఆకు,దంచి పెట్టుకున్న మసాలా ను వేసుకుని వేయించుకోవాలి.తర్వాత కరవేపాకు,జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి.తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి.
    



తర్వాత నానబెట్టిన రైస్ ని వాడ్చుకుని పాన్ లో మసాలా తో పాటు వేయించుకోవాలి(2 నిమిషాలు).






తర్వాత దీనిని అంతటిని రైస్ కుకర్ లో వేసుకుని కొబ్బరిపాలు+నీళ్ళు  కలిపి 8 రైస్ కప్స్ వేసుకుని కుకర్  ఆన్
చేసుకోవాలి .   






  అంతే కుకర్ వార్మ్ లోకి రాగానే ఎంతో రుచి గల కొబ్బరి అన్నం రెడీ.











  




   




















  



No comments:

Post a Comment